మంత్రి బొత్స కు తగిలిన నిర‌స‌న సెగ

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం లో చేదు అనుభవం ఎదురైంది. అనంత‌పురంలో వ‌ర‌ద‌లపై స‌మీక్షాస‌మావేశం నిర్వహించి,తిరిగి వస్తున్న క్ర‌మంలో మంత్రి కారును విద్యార్థి సంఘాలు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేత‌లు అడ్డుకున్నారు. వ‌ర‌ద భాదతుల‌కు స‌హాయం అందించాల‌ని..న‌ష్ట‌పోయిన రైతుల‌కు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కానీ బొత్సా ఏం మాట్లాడ‌క‌పోవ‌డంతో వారు కారుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేయ‌డం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అంతకు ముందు అనంతపురం వరదలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి బొత్సా సత్యనారాయణ సాక్షిగా పయ్యావుల కేశవ్, గోరంట్ల మాధవ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క టీడీపీ నేతా స్పందించలేదని.. రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతుంటే టీడీపీ నేతలు ఇంట్లో నిద్రపోతున్నారంటూ ఎంపీ మాధవ్ విమర్శలు చేశారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దని.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడు ఉన్నారంటూ పయ్యావుల కేశవ్‌ను ఎంపీ మాధవ్ నిలదీశారు. పక్కపక్కన కూర్చున్న ఇద్దరి వాగ్వాదాన్ని చూసి మంత్రి బొత్స జోక్యంతో వివాదం సద్దుమణిగింది.