ఏపీ ఫై దయ చూపిన జవాద్ తుఫాను ..

గత నెల రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడ్డాయి. దీంతో అన్ని డ్యామ్ లు నిండిపోవడమేకాదు పలు ఆనకట్టలు సైతం తెగిపోయి పలు పల్లెలను ముంచాయి. ఈ క్రమంలో ఏపీకి జవాద్ తుఫాను ఎఫెక్ట్ పడనుందని తెలియడం తో అంత భయపడ్డారు. కానీ ఇప్పుడు ఏపీ ఫై జవాద్ తుఫాను దయ చూపించింది. ఉత్తరాంధ్రను కలవర పెట్టిన జవాద్ తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా తీరం వైపు మళ్లింది. శనివారం సాయంత్రం 5.30 గంటలకు జవాద్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తుఫాన్ గండం తప్పినప్పటికీ.. కోస్తా జిల్లాల్లో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

జవాద్ ప్రభావంతో పూరీ, జగత్‌సింగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం తీవ్ర వర్షాలు, బాలాసోర్, భద్రక్, కేంద్రపద, జైపూర్, కటక్, ఖుర్దా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జవాద్ తుఫాన్ దిశ మార్చుకొని బలహీనపడకపోతే.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉండేది. పంటలు చేతికి వస్తున్న తరుణంలో వర్షాలు కురిస్తే రైతులకు భారీ నష్టం వాటిల్లేది..కానీ ఇప్పుడు తుఫాన్ ముప్పు తప్పడం తో హమ్మయ్య అనుకున్నారు.