దేశవ్యాప్తంగా తగ్గుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు

Petrol-diesel prices decreased
Petrol-diesel prices decreased

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి. అమెరికాఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికాచైనా మధ్య ట్రేడ్ ఇష్యూ కారణంగా అంతకుముందు బంగారం వంటి అతివిలువైన లోహాల ధరలు, క్రూడాయిల్ ధరలు అంతకంతకు పెరిగాయి. ఇప్పుడు ఈ అంశాలు కొలిక్కి వస్తుండటంతో ఆయిల్, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు డాలరు మారకంతో రూపాయి బలపడుతోంది. దీంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు వరుసగా తగ్గుతున్నాయి. వరుసగా ఆదివారం నాలుగో రోజు, సోమవారం ఐదో రోజు తగ్గాయి. సోమవారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.98, బెంగళూరులో రూ.77.49, ముంబైలో రూ.80.58, చెన్నైలో రూ.77.89, హైదరాబాదులో రూ.79.73, గురుగ్రామ్‌లో రూ.74.43గా ఉంది. సోమవారం లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.68.26, బెంగళూరులో రూ.70.53, ముంబైలో రూ.71.57, చెన్నైలో రూ.72.13, హైదరాబాదులో రూ.74.43, గురుగ్రామ్‌లో రూ.67.20 గా ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/