సంక్రాతి సందర్భంగా బిగ్‌ సి బంపరాఫర్లు

రూ.12 కోట్ల విలువ చేసే బహుమతులు

big c mobiles store
big c mobiles store

హైదరాబాద్‌: సంక్రాతి పండుగ సందర్భంగా మొబైల్‌ ఫోన్ల రిటైల్‌ విక్రయ కంపెనీ బిగ్‌ సి మొబైల్స్‌ ప్రత్యే ఆఫర్లను ప్రకటించింది. స్క్రాంచ్‌ అండ్‌ విన్‌ ఆఫర్‌ కింద ప్రిజ్‌, వాషింగ్‌ మిషన్లు, ఎల్‌ఈడీ టీవీలు, ల్యాప్‌ట్యాప్స్‌, ఓవెన్స్‌ అందిస్తోంది. ఈ మేరకు సంస్థ ఎండీ బాలు తెలిపారు. రూ. 12 కోట్ల విలువైన బహుమతులు, అలాగే రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్స్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ విక్రయాలకు యాప్‌ను లాంచ్‌ చేసినట్లు తెలిపారు. మైక్రోమిక్స్‌ ఐయాన్‌ మొబైల్‌ రూ.13,990 విలువ చేసే హెచ్‌డి ఎల్‌ఈడీ టీవీని రూ. 8,999కే ఇస్తున్నట్లు తెలిపారు. రూ. 11,990 వ్యాల్యూ కలిగిన లెనొవో కె9 (4జిబి+64జిబి మెమొరీ) కొనుగోలుపై రూ.13,990 విలువ కలిగిన హెచ్‌ డీ ఎల్‌ఈడీ టీవీని ఉచితంగా 18,990 విలువ కలిగిన వివో వై17 (4జిబి+128జిబి మెమురీ) కొనుగోలుపై రూ.19,990 హెచ్‌ డీ ఎల్‌ఈడీ టీవీని రూ.13449 విలువ కలిగిన వివో వై91 (3జిబి+32జిబి మెమొరీ) కొనుగోలుపై రూ.13,990 హెచ్‌ డీ ఎల్‌ఈడీ టీవీని ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/