క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు హాజరుకానున్న జో బైడెన్

ఈ నెల 19న జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని వ్యాఖ్య

US President Joe Biden
US President Joe Biden

లండన్ః 96 ఏండ్ల బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ఈనెల 8న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీరి అంత్యక్రియలకు పెద్ద ప్రక్రియ ఉంటుంది. మరోవైపు రాణి అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. క్వీన్ అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని… ఈ నెల 19న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ… అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా హాజరవుతానని తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ కుమారుడు కింగ్ చార్లెస్ 3 కూడా తనకు తెలుసని చెప్పారు. అయితే, ప్రస్తుత విషాదకర పరిస్థితుల్లో ఆయనకు ఫోన్ చేయలేదని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/