క‌రోనా ఇంకా వెళ్లిపోలేదు..జో బైడెన్

వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్ష‌డు జో బైడెన్ స్వాతంత్య్ర దినోత్సవ‌ సంబ‌రాల నేప‌థ్యంలో వైట్‌హౌజ్ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. క‌రోనాపై యుద్ధం ముగియ‌లేద‌ని, ఆ మ‌హ‌మ్మారిపై సంపూర్ణ విజ‌యం సాధించాల్సి ఉంద‌న్నారు. క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో అమెరికా పైచేయి సాధించింద‌ని, కానీ ఆ మ‌హ‌మ్మారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అది ఇంకా వెళ్లిపోలేద‌న్నారు.

వైట్‌హౌజ్‌లో అతిథుల‌తో మాట్లాడుతూ.. డెల్లా వేరియంట్ లాంటి శ‌క్తివంత‌మైన వేరియంట్లు మ‌ళ్లీ విరుచుకుప‌డుతున్నాయ‌న్నారు. క‌రోనా వ‌ల్ల అమెరికాలో సుమారు ఆరు ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. 1776లో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన‌ అమెరికాను.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నుంచి విముక్తి పొందిన ఘ‌ట‌న‌ల‌ను పోల్చుతూ బైడెన్ మాట్లాడారు. క‌రోనాతో మృతిచెందిన అమెరిక‌న్లకు ఆయ‌న నివాళి అర్పించారు. గ‌త ఏడాది కాలం నుంచి మ‌నం చాలా వ‌ర‌కు చీక‌టి రోజుల్ని గ‌డిపిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక దివ్య‌మైన భ‌విష్య‌త్తును చూస్తామ‌న్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/