బైడెన్ ప్రభుత్వంలో అంజ‌లీ చ‌తుర్వేదికి కీల‌క ప‌ద‌వి

వాషింగ్టన్: భార‌త, అమెరికా సంత‌తికి చెందిన న్యాయ నిపుణురాలు అంజ‌లీ చ‌తుర్వేదికి బైడెన్ స‌ర్కార్‌లో కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. వెట‌ర‌న్స్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లో జ‌న‌ర‌ల్ కౌన్సిల్‌గా ఆమెను నియ‌మిస్తూ అధ్య‌క్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవ‌ల భార‌తీయ అమెరిక‌న్ల‌కు బైడెన్ ప్ర‌భుత్వం అనేక కీల‌క ప‌ద‌వుల్ని అప్ప‌గిస్తున్న విష‌యం తెలిసిందే.

అమెరికా న్యాయ‌శాఖ క్రిమిన‌ల్ డివిజ‌న్‌లో చ‌తుర్వేది డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమెకు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ.. వెట‌ర‌న్ అఫైర్స్ శాఖ‌కు జ‌న‌ర‌ల్ కౌన్సిల్‌గా చేశారు. మాజీ సైనికోద్యోగుల‌కు అత్యుత్త రీతిలో బెనిఫిట్స్‌, సేవ‌ల్ని అందేలా వెట‌ర‌న్స్ శాఖ చూసుకుంటుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/