అసాధారణ విజయం

వ్యూహాత్మక కార్యాచరణతో అధ్యక్షపీఠం పైకి

Biden-Extraordinary success
Biden-Extraordinary success

అమెరికా అధ్యక్ష ఎన్నికల పరంగా నెల కొన్న ఉత్కంఠకు జోబిడెన్‌ తెరదించారు.

ముందునుంచీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిన బిడెన్‌ తన ఓటుబ్యాంకును పటిష్టం చేసుకోవడంతోపాటు భారతీయ అమెరికన్లు, నల్లజాతీయుల ఓటుబ్యాంకులను ఎక్కువ ఆకర్షించగలిగారు.

అభ్యర్థుల ఎంపికతోపాటు ఉపాధ్యక్ష పదవికి మహిళా అభ్యర్థిని ఎంపికచేయడం అందులోనూ ఆఫ్రో అమెరికన్‌ మహిళ, భారతీయ మూలాలున్న మహిళను ఎంపికచేసి భారతీయ అమెరికన్ల ఓట్లను కొల్లగొట్టారనే చెప్పాలి.

వ్యూహాత్మక కార్యాచరణతో తన చిరకాల అధ్యక్షపదవి చేపట్టాలన్న కోరికను నెరవేర్చుకున్నారు.

అమెరికాకు 46వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పెన్సిల్వేనియా, నెవాడా, జార్జియా వంటి రాష్ట్రాల్లోసైతం ఓట్లను సాధించిన బిడెన్‌ చివరకు 280 ఎలక్టోరల్‌ ఓట్లకుపైగా సాధించారు.

45 రాష్ట్రాల్లో లెక్కింపు ముగిసేనాటికే ఆయనకు 264 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి. మిగిలిన ఐదు రాష్ట్రాలలెక్కింపు జరిగే సమయంలోనే కీలకమైన పెన్సిల్వేనియా, జార్జియా రా ష్ట్రాల లెక్కింపుపరంగా ఆయన భారీ ఆధిక్యం ప్రదర్శిం చడంతో చివరకు పెన్సిల్వేనియా ఓట్లు కూడా బిడెన ్‌ఖాతాలోనే చేరాయి.

తాను ఎట్టిపరిస్థితుల్లోను 300 ఎలక్టోరల్‌ కళాశాల ఓట్లతో విజయం సాధిస్తామని బిడెన్‌ ప్రక టించిన ధీమా ఆచరణలో వాస్తవరూపం దాల్చింది.

మరోపక్క కోర్టులకు వెళతామని, పెన్సిల్వేనియా, జా ర్జియా వంటి రాష్ట్రాల ఫలితాలపై సుప్రీంకోర్టుకుసైతం వెళ్లినా ట్రంప్‌కు చుక్కెదురయింది.

అలాగే ఎన్నికల్లో అక్ర మాలు జరిగాయని, బిడెన్‌కు పోల్‌ అయిన ఓట్లను తిరిగి లెక్కించాలని, మెయిల్‌ ఇన్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లపరంగా మరోసారి లెక్కింపు జరపాలని ముందు లెక్కింపు నిలిపి వేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఉన్న ఒక్క అవకాశం కూడా ట్రంప్‌ కోల్పోయారు.

ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమికి ప్రధాన కారణాలు హెచ్‌1-బి వీసాల రద్దు, కరోనావైరస్‌ కట్టడిలో వైఫల్యం, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, ఉపాధిలేక నిరుద్యోగులు పెరగడం వంటివే ఎక్కువ కనిపించాయి.

వీటన్నింటిపైనా దృష్టి సారించిన బిడెన్‌ ఒక్కసారిగా తమ పాలనలో భారతీ యులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, అమెరికా ఆర్థికవృద్ధిలో భారతీయులదే కీలకపాత్ర అని ఘంటా పథంగా చెప్పారు.

అంతటితో ఆగకుండా తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే హెచ్‌1-బితోపాటు అన్నిరకాల వీసా లపై ఉన్న రద్దును తొలగిస్తామని మరీ హామీ ఇచ్చారు.

అలాగే హెచ్‌1-బి పరిమితులు పెంచేయోచన కూడా పరిశీలిస్తామని ఎన్నికల్లో హామీలిచ్చా. ఓపక్క లెక్కింపులో ఆధిక్యం ఉన్న తరుణంలోనే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ పోలీసులు ఆయనకు బందోబస్తును పెంచడంతో ఇక విజ యం ఖాయం అని బిడెన్‌వైపే ప్రజలంతా మొగ్గు చూపించారు.

అందులోనే తొలి ఆసియా మహిళ, ఆఫ్రో అమెరికన్‌, తొలి భారతీయ మూలాలున్న మహిళ కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం కూడా బిడెన్‌కు పాలనపరంగా మరింత కలిసివచ్చిందనే చెప్పాలి.

ఫలితాల్లో ఇక విజయం ఖాయం అన్న ప్రకటన వెలువడిన వెంటనే నిపుణులతో కమలా, బిడెన్‌లు చర్చలు జరిపి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వైరస్‌ కట్టడికి అమ లయ్యే ప్రణాళికలపై చర్చలు జరిపారు.

ఇకపై అమెరికాలో ఎరుపు, నీలిరంగులుండవని అన్ని అమెరికా జెండాలే ఉం టాయని చేసిన ప్రకటన జోబిడెన్‌ రాజకీయ సమయ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. రెడ్‌, బ్లూ అంటే రిప బ్లికన్లు, డెమొక్రాట్లుగా భావిస్తారు.

ఇకపై రాజకీయా లుండవని, ప్రజలకు పారదర్శక సేవలందించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించి అమెరికా పౌరుల మన్ననలు పొందారనే చెప్పాలి.

రాజకీయంగా ప్రత్యర్థులు అయిన ప్పటికీ అమెరికన్లుగా అందరూ ఒక్కటేనని విభజన రాజ కీయాలు చేయబోనని, నా మార్కు పాలనను చూపిస్తానని అందరినీ కలుపుకుని ముందుకుపోతానని బిడెన్‌ ప్రకటించి సమైక్యతారాగం ఆలపించారు.

బరాక్‌ ఒబామా హయాం లో రెండుసార్లు కూడా ఉపాధ్యక్షునిగా పనిచేసారు. ఐదు దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో గడిపిన బిడెన్‌ సుదీర్ఘ పాలనానుభవం కలిగిన నాయకునిగా గుర్తింపు ఉంది.

గతంలో కూడా రెండుసార్లు అధ్యక్షపదవికి పోటీలో ఉండి ఆరోపణలు రావడంతో స్వఛ్ఛందంగా తప్పుకున్నారు.

42 ఏళ్లక్రితమే సెనేటర్‌గా ఎన్నికయిన బిడెన్‌ ఒబామా హ యాంలోనే ఆయనకు కుడిభుజంగా మెలిగారు.

కార్పొ రేషన్లపై పన్నుశాతం పెంపు, అమెరికా చైనా ట్రేడ్‌వార్‌, వైరస్‌ కట్టడి,ఆర్థిక పునరుద్ధరణకు ట్రంప్‌ ప్రకటించిన రెండులక్షల కోట్ల డాలర్ల ప్యాకేజి పెంపు అన్న అంశా లతోపాటు హెల్త్‌కేర్‌ కొనసాగింపు ఇపుడు కీలకం అవుతున్నాయి.

అలాగే ఇపుడు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న కమలా హ్యారిస్‌ కూడా భారతీయ మూలాలున్న మహిళా నేత. అమెరికా ఉపాధ్యక్షపదవికి ఒక మహిళ అందులోనూ ఆఫ్రో, ఆసియా ప్రాంత మహిళ ఎన్నికకావడం ఇదే ప్రథమం.

అయితే ఇదే చివరిసారి కాకూడదని మహిళలు మరింత ముందంజవేయాలని ఆమె ఆకాంక్షించారు. ఉపాధ్యక్షురాలిగా తన ఎన్నిక అమెరికా మహిళల విజయంగా ఆమె వెల్లడించారు.

అందరికీ సమాన అవకాశాలు అమెరికాలో ఉంటాయన్న విషయాన్ని పాలనలో చాటిచెప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

ట్రంప్‌ ముందు నుంచి అనుసరించిన దుందుడుకు వైఖరి కూడా ఓటమికి కారణమయిందని చెప్పాలి.

వర్ణవివక్ష ఉద్యమంతోపాటు హెచ్‌1-బి వీసాలు, కరోనా ఉధృతి వంటివే ఎక్కువ ముప్పు తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్ , హైదరాబాద్

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/