భారత్ స్పందన ఒక్కటే భిన్నంగా ఉంది : జో బైడెన్

రష్యాకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాం..బైడెన్
గతంలో ఎన్నడూ లేనంత బలంగా నాటో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు

biden-calls-india-shaky-in-russia-confrontation

వాషింగ్టన్: ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను ఖండించే విషయమై తమ భాగస్వామ్య పక్షాల్లో భారత్ స్పందన ఒక్కటే భిన్నంగా, షేకీగా (కుదుపునకు గురిచేసేలా) ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలోని భాగస్వామ్య పక్షం, నాటో, ఐరోపా యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ఐక్యంగా నిలబడడం పట్ల బైడెన్ అభినందించారు. అసాధారణ స్థాయిలో ఆర్థిక ఆంక్షలతోనూ రష్యాను కట్టడి చేస్తున్నట్టు చెప్పారు.

క్వాడ్ గ్రూపులోని సహచర సభ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ మాదిరిగా కాకుండా, భారత్ ఒక్కటే రష్యా చర్యను వ్యతిరేకించకుండా, సమర్థించకుండా తటస్థంగా ఉండిపోయింది. రష్యాకు వ్యతిరేకంగా విధించే ఆంక్షల్లోనూ భాగం కాలేదు. పైగా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో బైడెన్ ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ నాటో విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారన్న బైడెన్.. నాటో తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఐక్యంగా, బలంగా ఉందని ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/