ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న బిచ్చగాడు 2

బిచ్చగాడు సీక్వెల్ గా వస్తున్న బిచ్చగాడు 2 సినిమా తాలూకా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2016లో బిచ్చగాడు మూవీ తెలుగు లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, మౌత్ టాక్ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు తెలుగు లో మారుమోగిపోయింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తోన్నారు. పిచ్చైకారన్2 అనే టైటిల్‌‌‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తోన్నారు. అలాగే ఈ సినిమాను తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో డబ్ చేస్తున్నారు. కాగా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు.

విజయ్ ఆంటోని దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కావ్య థాపర్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రితిక సింగ్ .. రాధా రవి .. మన్సూర్ అలీఖాన్ కనిపించనున్నారు.