దేవుడితో సహవాసం గొప్ప భాగ్యం

అంతర్వాణి: బైబిల్‌ కథలు

Jesus
Jesus

‘నా గొఱె€లు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు., ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.

వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు (యోహాను 10:27,28,29). నిజంగా ఎవరైతే యేసుప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి, వెంబడిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయన స్వరాన్ని వింటారు.

పరిశుద్ధాత్మ నిత్యం వారిని ప్రేరేపిస్తూనే వ్ఞంటుంది. అది మంచైనా కానివ్వండి, చెడు అయినా కానివ్వండి.

తప్పనిసరిగా దేవ్ఞడి స్వరాన్ని నిత్యం వింటూనే వ్ఞంటారు. అందుకే యేసుప్రభువ్ఞ నా గొఱె€లు నా స్వరాన్ని వింటాయని అన్నాడు.

కాబట్టి మనం ఏదైనా తప్పు చేస్తే పరిశుద్ధాత్మ మనల్ని గద్దిస్తుంది తద్వారా వెంటనే మనం దాన్ని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తాం.

దేవుడిని క్షమాపణల్ని వేడుకుంటాం. సంగతులను సరిచేసుకుంటాం. నిత్యం తోటివారితో సమాధానంగా వ్ఞంటూనే పరిశుద్ధతను కాపాడుకుంటాం. ఇది దేవ్ఞడి కృపను బట్టి మనకు లభించిన ధన్యత. సరే ఇంతకీ మనం దేవ్ఞడి స్వరాన్ని ఎలా వినగలం?

ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. సంఘటనల ద్వారా, పరిస్థితుల ద్వారా, దేవ్ఞడి సేవకుల ద్వారా అంతేకాదు కష్టాలు, సమస్యల ద్వారా కూడా దేవుడి మాట్లాడతాడు.

తన స్వరాన్ని వినిపిస్తూనే వ్ఞంటాడు. మనం ఆ స్వరాన్ని వింటూ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవ్ఞడితో మనకున్న అనుబంధాన్ని దినదినం వృద్ధి చేసుకుంటూ వ్ఞండాలి. అపవాది దేవుడితో మనకున్న బంధాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తూనే వ్ఞంటాడు.

దేవ్ఞడికి వ్యతిరేకంగా పాపం చేస్తూ, ఆయన నుండి మనల్ని దూరం చేయడమే అపవాది వృత్తి. కాబట్టి ప్రార్థన ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా పరిశుద్ధులతో సహవాసం ద్వారా మనం దేవుడికి సమీపంగా జీవించవచ్చు.

కాబట్టి దేవ్ఞడితో మనకు వ్యక్తిగత అనుబంధం ఉందా లేదా అనేది పరిశీలించుకుంటూ వ్ఞండాలి. అది లేకపోతే మన సేవ, విశ్వాసం వ్యర్థమే.

మనమెన్ని గంటలు ప్రార్థిస్తున్నామో ముఖ్యం కాదు ఎంతగా దేవుడికి సమీపంగా జీవిస్తున్నాం

అదే దేవుడు మననుంచి కోరుతున్నాడు. కాబట్టి ఇకనుంచైనా దేవుడికి సమీపంగా జీవించేందుకు ప్రయత్నిస్తే అదే గొప్ప భాగ్యం. ఆయన స్వరాన్ని నిత్యం వినేందుకు మనం ప్రయత్నించాలి.

అందుకు దేవుడు సాయం చేయునుగాక..

  • పి.వాణీపుష్ప

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/