దేశవ్యాప్తంగా 64 నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు

Sunil Arora Chief Election Commissioner
Sunil Arora ,Chief Election Commissioner

NewDelhi: దేశవ్యాప్తంగా 64 నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సిఇసి సునీల్‌ అరోరా చెప్పారు. ఉప ఎన్నికలకు పోలింగ్‌ కూడా అక్టోబర్‌ 21న జరుగుతుందని ఆయన అన్నారు. 24న కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.