గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న భూపేంద్ర పటేల్

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి గా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో పటేల్ పేరును ప్రకటించారు. భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది.

ముందు నుండి నలుగురి పేర్లు ప్రముఖంగా ప్రచారం సాగాయి. ఆ నలుగురిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా భూపేంద్ర పటేల్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. గట్లోడియా నియోజకవర్గం నుండి ఎన్నికైన భూపేంద్ర పటేల్, తన ప్రత్యర్థిపై లక్షా 17వేల మెజార్టీతో నెగ్గాడు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం తో ఆయన నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.