బ్రిడ్జి పనులకు కెటిఆర్‌ భూమిపూజ

ktr
ktr

హైదరాబాద్‌: మంత్రులు కెటిఆర్‌, తలసాని సనత్ నగర్‌లో నాలుగు లైన్ల రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు. సనత్ నగర్ ఇండస్ట్రియల్ నుంచి బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య 6.5 కి మీ మేర దూరం తగ్గనుంది. 68 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. ఫతే నగర్ ఫ్లై ఓవర్‌కు ప్రత్యామ్నాయంగా మరో మరో రెండు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మంత్రులు భూమిపూజ చేయనున్నారు. ఫతే నగర్ బ్రిడ్జ్‌పై రద్దీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ ఆర్ఓబీ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేస్తోంది. నిర్మాణ వ్యయం 45 కోట్ల రూపాయలు కానుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/