మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. గత కొద్దీ రోజులుగా ఎమ్మెల్యే శిల్పా రవికి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవి బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిల ప్రియ సవాల్ చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఈరోజు నంద్యాలలో బహిరంగ చర్చకు రావాలని, సాయంత్రం నాలుగు గంటలకు గాంధీచౌక్ వద్ద చర్చకు రావాలని భూమా అఖిలప్రియ ఏర్పాట్లు చేస్తుండడంతో భూమా అఖిలప్రియ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.30 యాక్ట్ అమలులో ఉన్న కారణంగా బహిరంగ చర్చకు అనుమతి లేదని, పోలీసుల అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న కారణంగా ఎందుకు చర్య తీసుకోరాదని భూమా అఖిలప్రియకు, భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకునికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భూమా అఖిలప్రియ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.