ఒడిశాలోనే 2023 పురుషుల ప్రపంచకప్‌ హాకీ!

Odisha CM Naveen Patnaik
Odisha CM Naveen Patnaik

భువనేశ్వర్‌: ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మరోసారి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జరగబోయే ఈ టోర్నమెంట్‌కి ఒడిశా ఆతిధ్యం ఇవ్వనుంది. గతేడాది జరిగిన హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిధ్యమిచ్చింది. కాగా రెండోసారి జరిగే ఈ టోర్నమెంట్‌కు కూడా భువనేశ్వరే ఆతిధ్యం ఇవ్వడం విశేషం. అయితే ఈ ప్రపంచకప్‌ హాకీ టోర్నీకి భువనేశ్వర్‌తోపాటు రూర్కెలా కూడా కలిసి ఆతిధ్యం ఇవ్వనుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో హాకీకి భారీ స్పందన ఉందని, తాము 2018 ప్రపంచకప్‌ హాకీని విజయవంతంగా నిర్వహించామని నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. తాము ఎల్లప్పుడూ హాకీ క్రీడకు మద్దతుగా నిలుస్తామన్నారు. మరోకసారి ఒడిశాకు అవకాశం కల్పించటం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలను 2023 హాకీ ప్రపంచకప్‌లో అందిస్తామని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి భారత ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు, హాకీ ఇండియా అధ్యక్షుడు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/