న్యూ ఇయర్ కానుకగా భోళా శంకర్‌ క్రేజ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తమిళ్ మూవీ వేదాళం తెలుగు లో ‘భోళా శంకర్‌’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భాంగా ఈ మూవీ ప్రకటన వచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ మొదలవ్వగా..న్యూ ఇయర్ కానుకగా సరికొత్త అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.

రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో భోళా శంకర్‌ నుంచి అప్డేట్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. #SWAGofBHOLAA పేరుతో ఈ అప్డేట్‌ ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది చూడాలి.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు.