మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ప్రారంభం
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా క్లాప్

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కనుంది. ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ వేదాళం కి రీమేక్ గా తీయబోతున్నారు. గురువారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ముహూర్తం కంప్లీట్ చేశారు. మెగాస్టార్ తో వర్క్ చేసిన, ఇంకా చెయ్యాల్సి ఉన్న యంగ్ దర్శకులు మిల్కీ బ్యూటీ తమన్నాతో ఈ సినిమా లాంచ్ స్టార్ట్ అయ్యింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీద క్లాప్ కొట్టడంతో సినిమా ప్రారంభం అయింది. కార్యక్రమంలో నిర్మాత అనీల్ సుంకర సహా ఇతర ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తలకు: https://www.vaartha.com/telangana/