‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ విడుదల

మోడరన్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi 'Bhola Shankar' first look released
Chiranjeevi ‘Bhola Shankar’ first look released

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “భోళా శంకర్”. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు  రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ రోజు మార్చ్ 1న మహా శివరాత్రి శుభ సందర్భంగా భోళా శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

వైబ్ ఆఫ్ భోళా – అనే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ బెస్ట్ అవతారంలో కనిపిస్తున్నారు.  మెగాస్టార్ దుస్తులు దగ్గర్నుంచి సిట్టింగ్ పొజిషన్ వరకు చేతిలోని చైన్ని తిప్పే విధానం వరకు చిత్రం అంతా మెగా స్టామినాను తెలియజేస్తున్నది. శివుని శక్తివంతమైన ఆయుధం అయిన త్రిశూల్ పవర్ ను తెలియజేస్తున్నది. చిరంజీవి చేతిలో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గొలుసును చూస్తే ఈ పోస్టర్ మహా శివరాత్రికి విడుదల చేయడానికి సరైన సమయం అని తెలుస్తున్నది.

స్పోర్టింగ్ షేడ్స్, చిరంజీవి జీపు బంపర్ పై కూర్చొని కనిపించే విధానం మరియు ఈ మోడ్రన్ లుక్ లో ఆయనను చూడటం ఒక కన్నుల పండుగ. మెగాస్టార్కి అంతటి ఎలివేషన్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో జనం సంగీత వాయిద్యాలతో కనిపిస్తారు. ఈ పోస్టర్ మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులను తప్పకుండా మెప్పిస్తుంది.

మహతి స్వర సాగర్ అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రత్యేక సందర్భంలో విడుదల చేసిన మోషన్ పోస్టర్  రావడం అందరినీ ఆకట్టుకుంటుంది. జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో ప్రధాన నాయికగా కనిపించనుంది, ఇందులో భావోద్వేగాలు, ఇతర అంశాలు సందర్భానుసారంగా ఉంటాయి.

క్రియేటివ్ కమర్షియల్స్తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డూడ్లీ కెమెరా బాధ్యత నిర్వహిస్తున్నారు. కథ పర్యవేక్షణ సత్యానంద్,  సంభాషణలు తిరుపతి మామిడాల, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్ ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/