భోగి సంబురాలు

పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavita in Bhogi Samburalu
MLC Kavita in Bhogi Samburalu

Hyderabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి సంబురాలు వేడుకగా జరిగాయి. చార్మినార్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ముందుగా  భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత అందరికీ  అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలని జరుపుకుంటామన్నారు.  గత ఏడాదంతా కరోన ఇబ్బందులు పడ్డాం,  ఆ చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలని ఆమె ఆకాంక్షించారు. 

రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరు కరోన మహమ్మారి నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నానని అన్నారు.  ఇది మంచి ఆరంభం కావాలని సంక్రాంతి అంటేనే సిరిసంపదలు ఇచ్చే పండగ..అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని ఆకాంక్షిస్తున్నాని కవిత అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/