పవన్ కళ్యాణ్ `భీమ్లానాయక్` ట్రైలర్
సోషల్ మీడియాలో సంచలనం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత చేసిన చిత్రం వకీల్ సాబ్
. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ పింక్
ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పవన్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ తరువాత పవన్ చేస్తున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లా నాయక్
. మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్
ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఈ మూవీకి రచనా సహకారం కూడా అందించారు. 21 వ తేదీ రాత్రి 8:10 గంటలకు ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ టెక్నికల్ సమస్యల కారణంగా గంట ఆలస్యంగా రిలీజ్ చేశారు. భీమ్లానాయక్
ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/