భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ అరెస్టు

Bhim Army chief Chandrashekhar
Bhim Army chief Chandrashekhar

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలిపే క్రమంలో ఢిల్లీలోని జామా మసీదు వద్ద కళ్లుగప్పి మసీదులోకి ప్రవేశించిన భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న‌ పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి.. మ‌ళ్లీ త‌ప్పించుకున్న ఆజాద్‌ను ఇవాళ అరెస్టు చేశారు. అరెస్టు చేస్తున్న క్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. హింసను ప్రోత్సహించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. తమ వర్గాలు శాంతియుతంగా మసీదులో నిరసన తెలుపుతున్నాయని పేర్కొన్నారు. మ‌రో వైపు పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఉదృత‌మ‌వూతేనే ఉన్నాయి. యూపీలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 11కు చేరుకున్న‌ది. బెంగాల్‌లో మాత్రం ప‌రిస్థితి శాంతియుతంగానే ఉన్న‌ది. అక్క‌డ ఎటువంటి ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డంలేదు. కోల్‌క‌తాలోని సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు వివిధ మ‌తాల‌కు చెందిన పెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని వారికి ఆదేశించారు. ద‌రియాగంజ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో ప‌ది మందిని అరెస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/