భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

A Still from Bheemla Nayak
A Still from Bheemla Nayak

ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో రావడం తో మిగతా సినిమాలకు ఇబ్బంది గా మారింది. అప్పటి వరకు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ను ఏప్రిల్ 1 కి వాయిదా వేశారు. ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 14 న అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ జనవరి 07 న వస్తుండడం తో సర్కారు వాయిదా వేసుకోక తప్పలేదు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సైతం వాయిదా పడబోతుందని..జనవరి 26 కానీ మహాశివరాత్రి కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే కావొచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ఫై మరోసారి క్లారిటీ ఇచ్చారు. మొదటి నుండి చెపుతున్నట్లు జనవరి 12 నే తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ బర్త్ డే నేపథ్యంలో ఈ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. పవన్ కు ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.