పవన్ కళ్యాణ్ అభిమానులు తట్టుకోగలరా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న భీమ్లా నాయక్ తో పాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సినిమాల ను ఓటిటి లో రిలీజ్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని , మంచి ధర వస్తే ఓటిటి లో రిలీజ్ చేసుకొమ్మని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తుంది.

ముందుగా భీమ్లా నాయక్ మూవీ ఓటిటి లో డైరెక్ట్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్..సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. రీసెంట్ గా విడుదలైన పవన్ , రానా టీజర్లు సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇప్పుడు ఈ సినిమా కు సంబదించిన ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్, అడియో రైట్స్ రికార్డు మొత్తానికి అమ్ముడు పోయాయట. మిగిలిన నాన్ థియేటర్ హక్కులు (శాటిలైట్, డిజిటల్ ఎక్సెట్రా) కోసం 70 కోట్ల రేంజ్ లో బేరం చెబుతున్నారని వినికిడి. రేట్లు, ఆక్యుపేషన్ ఇలా అన్నీ సజావుగా వుంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ కలిపి 80 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ వుంటుంది. అంటే సినిమా మొత్తం టర్నోవర్ 170 కోట్ల వరకు వుండే అవకాశం వుంది.

ఇప్పుడు ఆ రేంజ్ మొత్తం వస్తే ఓటిటికి ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ, పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు పూర్తి సుముఖంగా వున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాదాపు బేరం అయిపోయిందనీ టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే తెలుగులో వందల కోట్ల రేంజ్ లో జరిగిన తొలి ఓటిటి డీల్ ఇదే అవుతుంది. ఈ సినిమా మాత్రమే కాదు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సినిమాల నిర్మాతలను పిలిచి, మీకు నచ్చితే, కుదిరితే ఓటిటికి వెళ్తామంటే వెళ్లండి, నాకు ఏ అభ్యంతరం లేదని పవన్ చెప్పాడట. మరి నిజంగా పవన్ సినిమా ఓటిటి లో రిలీజ్ అయితే అభిమానులు తట్టుకోగలరా అనేది సందేహమే. పవన్ ను వెండితెర ఫై చూడాలని అభిమానులు తహతహలాడుతుంటారు. పవన్ సినిమా రిలీజ్ రోజు అభిమానులంతా థియేటర్స్ ను ముస్తాబు చేసి పెద్ద పండగలా భావిస్తారు. అలాంటిది ఓటిటి లో రిలీజ్ అంటే వారు ఏమంటారో చూడాలి.