దుమ్ములేపిన భీమ్లా నాయక్ కొత్త టీజర్ ..దీపావళి విషెష్ ఈ రేంజ్ లోనా..

దీపావళి కానుకగా భీమ్లా నాయక్ నుండి అదిరిపోతే టీజర్ వచ్చింది..ఈ రేంజ్ లో టీజర్ వదులుతారని అభిమానులు అనుకోలేదు. ‘లాలా భీమ్లా’ వీడియో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రోమాలు నిక్క పొడిచే బీట్‌తో షురూ అయింది ప్రోమో. ‘నాగరాజుగారు హ‌ర్టీ కంగ్రాచ్చులేష‌న్స్ అండి..మీకు దీపావ‌ళి పండుగ ముందే వ‌చ్చేసిందండి ..హ్యాపీ దీపావ‌ళి’ అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ లలో ఈలలు వేసే విధంగా ఉంది. ఇప్పటివరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ప్రోమో మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా ఆకట్టుకుంది.

సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..ఆ అంచనాలకు తగ్గట్లే సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ చేయబోతున్నారు. ఇక మీరు కూడా దీపావళి ప్రోమో ఫై లుక్ వెయ్యండి.

YouTube video