రేపు భీమ్లా నాయక్ నుండి నాల్గో సాంగ్ విడుదల..

రేపు భీమ్లా నాయక్ నుండి నాల్గో సాంగ్ విడుదల..

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో వస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. ప్రతి రోజు ఏదొక అప్డేట్ ఇస్తూ సినిమా ఫై మరింత అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..రేపు (డిసెంబర్ 01) ఉదయం10 గంట‌ల 08 నిమిషాల‌కు ‘అడవి త‌ల్లి మాట‌…’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ పవన్ కళ్యాణ్ కు సంబదించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీక్ష‌ణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అత‌నిలో అడవి క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి సినిమాను జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రానా స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ జోడీ క‌డుతుంది. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా..త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాగర్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు.