సిలబస్‌లో భగవద్గీతను చేర్చడాన్ని తప్పుపట్టిన కమలహాసన్‌

Bhagavath geetha
Bhagavath geetha

చెన్నై: తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ సిలబస్‌లో భగవద్గీతను ప్రస్తావించడం సరికాదని మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ విమర్శించారు. మతం అనే అంశాన్ని విద్యార్థులకు ఆపాదించకూడదని, ఒకరు ఇదే మతాన్ని ఆచరించాలని చెప్పడం కూడా పద్ధతి కాదని, అలా చెప్పే ఎవరికీ లేదని కమలహాసన్‌ అన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, ఘాటు విమర్శలు చేశారు. భగవద్గీతలోని గీతోపదేశాలు సిలబస్‌లో చేర్చవద్దని, విద్యార్ధులు ఎప్పటికీ మంచి పుస్తకాలనే చదివేందుకు ఉత్సాహంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఒక మతాన్ని కొందరు మాత్రమే శాసించలేరని, మతస్వేచ్చపై మాట్లాడిన కమలహాసన్‌ మతగురువులుగా తయారవుతారా లేక మత వ్యాపకులుగా తయారవుతారా అన్నది విద్యార్థులే నిర్ణయించుకోవాలన్నారు. విద్యార్థులకు చదువుతున్న కోర్సుకు సంబంధించిన పుస్తకాలు, అందుకు సంబంధించిన సిలబస్‌ను చదివేలా చూడాలి తప్ప మతపరమైన అంశాలను వారికి చెప్పేందుకు ప్రయత్నించవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

చదువుతో పాటు భవిష్యత్తుపై వారు సొంత నిర్ణయాలు తీసుకునేలా చూడాలని చెప్పిన ఆయన వాళ్లు భవిష్యత్‌లో ఏం కావానుకుంటున్నారో అనేది సిలబస్‌ నిర్ణయించకూడదని వ్యాఖ్యానించారు. అన్నామలై యూనివర్సిటీ సిలబస్‌లో సంస్కృతాన్ని ఒక సబ్జెక్ట్‌గా పెట్టారు. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం నిరసన తెలిపింది. సిలబస్‌లో భగవద్గీతను చేర్చడాన్ని డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌ తప్పుపట్టారు. ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కూడా చెప్పారు. ఫిలాసఫీ బోధించాలన్న ఉద్దేశంతో భగవద్గీత ఉపదేశాలు సిలబస్‌లో చేర్చారని స్టాలిన్‌ ఖండించారు. మరోవైపు కమలహాసన్‌ పార్టీని ఒక ఫాస్ట్‌ఫెడ్‌ సెంటర్‌గా నడుపుతున్నారని అన్నాడిఎంకె అధ్యక్షుడు మంత్రి జయకుమార్‌ ఎద్దేవా చేశారు. అందుకు కమల్‌హాసన్‌ సమాధానంగా అన్నాడిఎంకె కూడా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతోందని తను కూడా అదే నడుపుతుండడంతో వారు తనకు పోటీగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. అంతేగాక అన్నాడిఎంకె నేతలు రాజకీయ వ్యాపారులని కూడా వారిని విమర్శించారు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/