రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియా ప్రకటన ఫై భట్టి క్లారిటీ

కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు పరోక్షంగా ప్రకటించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో హాట్ టాపిక్ అయ్యింది. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు, తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందని , ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని సోనియా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పేర్కొన్నారు.

సోనియా వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన శకం మొదలైందని ప్లీనరీ సమావేశాల్లో సోనియా చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఎదుగుతుందన్నారు. మల్లిఖార్జున ఖర్గేకు దేశ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉందని, ఆయన ఆధ్వరంలో పార్టీ పుంజుకుంటుందని భట్టి చెప్పారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తారన్నారు.