ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని ఆ సియంకు ఆహ్వానం

bhatti vikramarka
bhatti vikramarka

హైదరాబాద్‌: కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 15 శాతం నిర్మాణానికే రూ. 50 వేల కోట్లు ఖర్చయితే..మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెకు నిర్మాణంపై వాస్తవానలు దాచే ప్రయత్నం చేస్తున్నారని, తమ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. 15 శాతం కూడా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశాడని మహారాష్ట్ర సియం ఫద్నవీస్‌ను పిలుస్తున్నారని నిలదీశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/