డిసెంబర్‌ నుంచి కాల్‌ డేటా చార్జీల మోత

ఎయిర్‌టెల్‌, వొడా ఐడియా వెల్లడి

mobile charges hike
mobile charges hike

ఢిల్లీ: ఇటీవలే వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు భారీ స్థాయిలో నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వ్యాపారం లాభదాయకంగా మార్చుకునేందుకు ధరలను పెంచుతున్నట్లుగా ఈ కంపెనీలు పేర్కొన్నాయి. అయితే ఈ చార్జీలను డిసెంబరు ఒకటో తేది నుంచి పెంచనున్నట్లు ముందుగా వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. తమ కస్టమర్లు ప్రపంచస్థాయి డిజిటల్‌ అనుభూతిని ఆస్వాదించేందుకు ప్రయత్నాలు చేస్తామని, అందుకు అనుగుణంగా తమ టారీఫ్‌ను పెంచుతున్నామని వొడా ఐడియా ప్రకటించింది. అయితే వొడాఫోన్‌ ఐడియా ప్రకటించిన కొంత సమయానికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ చార్జీలను డిసెంబర్‌ నుంచి పెంచనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచుతామని మాత్రమే ఈ కంపెనీలు ప్రకటించాయి కానీ వాటి ధరలను ఏ మేరకు పెంచుతారనేది మాత్రం ఈ రెండు కంపెనీలు వెల్లడించలేదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana