అర్ధరాత్రి నుంచి భారత్ లాక్ డౌన్

జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

PM Modi

New Delhi: ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి భారత్ లాక్ డౌన్ ను ప్రధాని మోడీ ప్రకటించారు. జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, దేశాన్ని కాపాడటానికి కఠిన నిర్ణయం తప్పడం లేదని అన్నారు.

ఈ లాక్ డౌన్ ను అందరూ పాటించాలని అన్నారు. వారం వ్యవధిలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది రెండో సారి. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నదని మోడీ అన్నారు. ఈ మహమ్మారిపై పోరులో భారత్ విజయం సాధిస్తుందన్నారు. అందుకు ప్రజాసహకారం అవసరమన్నారు.

ఈ అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని మోడీ చెప్పారు.

సంపూర్ణ లాక్ డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదేనన్నారు. రానున్న మూడు వారాలూ అత్యంత కీలకమైనవని చెప్పిన ఆయన కరోనా నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా సహకరించాలన్నారు.

జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన స్ఫూర్తితో జనం అంతా సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/