కోవాగ్జిన్‌కు హాంగ్‌కాంగ్ గుర్తింపు
covaxin-vaccine
న్యూఢిల్లీ : కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు ఇప్పుడు హాంగ్‌కాంగ్ కూడా గుర్తింపును ఇచ్చింది. కోవిడ్19 వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్‌ను చేర్చారు. కోవాగ్జిన్ వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నట్లు హాంగ్ కాంగ్ తెలిపింది. ఒక రోజు క్రితమే బ్రిటన్ కూడా కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి పచ్చజెండా ఊపింది. కోవాగ్జిన్ తీసుకున్న వారిని ఐసోలేట్ చేయడం లేదని ఇంగ్లండ్ వెల్లడించింది. నవంబర్ 3వ తేదీన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగం కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. కోవాగ్జిన్ టీకా నిల్వపరిమితి కాలాన్ని కూడా పెంచినట్లు భారత్ బయోటెక్ సంస్థ చెప్పింది. కోవాగ్జిన్ టీకాను 12 నెలల వరకు వినియోగించవచ్చు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/