బుమ్రాను ప్రశంసించిన బౌలింగ్‌ కోచ్‌

Bumrah
Bumrah

జమైకా: భరత్‌ అరుణ్‌ ఇటీవలే తిరిగి టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌ ఓ భారతీయ బౌలర్‌ వేసిన అత్యుత్తమ స్పెల్‌ అని బౌలింగ్‌ కోచ్ అరుణ్ అన్నారు. పరిస్థితులకు తగినట్టు అతడు తన లెంగ్త్‌లు మార్చుకున్నాడని ప్రశంసించారు. 318 పరుగుల తేడాతో గెలిచిన ఈ పోరులో బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. బుమ్రా ఆలోచించే బౌలర్‌. పరిస్థితులకు అనుగుణంగా లెంగ్త్‌లు మార్చుకుంటాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్‌ చూస్తే మీకే అర్థం అవుతుంది. చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్‌ వేసిన అత్యుత్తమ స్పెల్‌ అది. అంతిమంగా మనకు కావాల్సింది వికెట్లే. అయితే నేను వాటిపై దృష్టి పెట్టను. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కగా అమలు చేయడంపై దృష్టి సారిస్తా. అప్పడు వికెట్లు వాటంతట అవే వస్తాయి. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా కొన్ని షార్ట్‌ బంతులు వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లెంగ్త్‌ను సవరించుకున్నాడు అని అరుణ్‌ అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/