వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆర్మీ ఫ్యాన్స్‌

bharat army
bharat army


లండన్‌: ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌ కోసం ఇలాగే 22 దేశాల్లోని 8 వేల మంది భారత్‌ ఆర్మీ అభిమానులు తరలిరానున్నారు. టీమిండియాను సపోర్టు చేసే అభిమానులు కలిసి భారత్‌ ఆర్మీ పేరుతో మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌ ఆర్మీ అభిమానులు వస్తున్న విషయాన్ని ఐసిసి వెల్లడించింది. 1999 వరల్డ్‌కప్‌ సందర్భంగా కేవలం నలుగురితో ఈ భారత్‌ ఆర్మీ ప్రారంభమైంది. అది కాస్తా ఇప్పుడు వేల మందికి చేరింది. ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది భారత్‌ ఆర్మీ అభిమానులు ఉంటున్నారు. భారత్‌ ఆర్మీ ఇపుడు కేవలం యూకేలోనే లేదని, అంతర్జాతీయంగా వివిధ దేశాలకు వ్యాపించిందని ఈ ఆర్మీ ఫౌండర్లలోనే ఒకరైన రాకేష్‌ పటేల్‌ చెప్పారు. యూకేతో పాటు ఇండియా, యూఏఈ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏలాంటి దేశాల్లో భారత్‌ ఆర్మీ అభిమానులు ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/