తెలుగు తెరపై భాగ్యశ్రీ కూతురు..

చిత్రసీమలో వారసులు , వారసురాళ్లు ఎంట్రీ అనేది కామన్. ఇప్పటికే ఎంతోమంది ఎంట్రీ ఇచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ కాగా..మరికొంతమంది ప్లాప్ అయ్యారు. ఈ క్రమంలో ప్రేమ పావురాలు ఫేమ్ భాగ్యశ్రీ కూతురు అవంతిక తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతుంది. బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నాంది ఫేం సతీశ్‌ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రంలో అవంతిక కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. మేకర్స్‌ ప్రపొజల్‌కి భాగ్యశ్రీ కూడా అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే అవంతిక సెట్‌లో అడుగుపెడతారని సమాచారం.

ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే…‘మైనే ప్యార్‌ కియా’(ప్రేమ పావురాలు) అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత ‘యువరత్న రానా’ చిత్రంలో మెరిశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘రాధేశ్యామ్‌’ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లోనూ ఆమె నటిస్తున్నారు. మరి ఈమె కూతురు తెలుగు లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.