‘ఆమ్ ఆద్మీ’ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భ‌గ‌వంత్ మాన్‌

పార్టీ నేష‌న‌ల్ క‌న్వీన‌ర్ అరవింద్ కేజ్రీవాల్‌ వెల్లడి

Bhagwant Mann as 'Aam Aadmi' Punjab CM candidate
Bhagwant Mann with kejriwal

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి పేరును ఆ పార్టీ నేష‌న‌ల్ క‌న్వీన‌ర్ అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మంగళవారం జరిగిన స‌మావేశంలో పార్టీ లీడ‌ర్ భ‌గ‌వంత్ మాన్‌ని సీఎం అభ్యర్థి గా వెల్లడించారు. పార్టీ చేప‌ట్టిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఆయ‌న‌కు పెద్ద ఎత్తున ఓట్లు వ‌చ్చాయ‌ని, ఆయన్ని స‌పోర్టు చేస్తూ యువత ప్రచారం చేస్తోందని కేజ్రీవాల్ వివరించారు.

క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/