భగవద్గీత -67

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita

ఎవరైనా సిగరెట్లు తాగుతూ పేకాట ఆడుతుంటే, గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోండి. దివ్య మంగళాకారునికి పూజలు చేయండి, అని చెప్పాలి. వారు నిరంతరం అలాంటి విగ్రహ పూజ లోనే గడుపుతుంటే ఇంతవరకు మంచిపనే చేశారు. ఇక మీదట నిరాకారుడై సర్వ వ్యాపియైన దైవాన్ని ఆరా ధించండి అని చెప్పాలి. ఇది తెలిసిన వాడు ‘జ్ఞాని చేయవలసిన కర్తవ్యం.

ఎవరెవరు ఏ స్థాయిలో వున్నారో గమనించి వారికి మరికొంత ఉన్నతమైన విషయాలను అవగాహన అయ్యేట్టు చేసి ముందుకు నడిపించాలి. కానీ పారా యణ చేస్తున్న వాడిని ఆచరణకు ప్రధాన్య మివ్వు అని అంటే వాడు పారా యణను కూడా వదలి వేస్తాడు. విగ్రహారా ధన అంతమంచిదికాదు అని అంటే వాడు దాన్ని కూడా మానేసి పేకాటనే ఆడు తాడు. దుర్భలులు తెలుసుకొన్న పక్షంలో వాటిని అర్థం చేసుకోవ టంలో చాలా తికమక పడతారని, వారి మనస్సు లు భావసంక్షోభానికి గురౌతవని వారి వాదం. అందుచేత ఈ కింది శ్లోకం ఉదహరంచబడు తుంటుంది.
-న బుద్ధి భేదం జనయేదజ్ఞానం, కర్మ సంగినామ్‌,
యోజయే తర్వ కర్మాణి విద్వాన్యుక్త స్సమాచరన్‌
పామరులకు జ్ఞానోపదేశంచేసి,
కర్మలను గురించి వారికున్న భావాలను చెదరకొట్టకూడదు. జ్ఞాని తాను స్వయంగా సంయమంతో కర్మను ఆచారిస్తూ పామరుల చేత కర్మ చేయిస్తూ ఉండాలి ఈ మాటను, ఇలాంటి సమర్థనను వివేకానంస్వా అంగీకరించరు. ఆయన అంటారు ‘మానవులు ఆ్వర్థపరులు, జ్ఞానరంగంలతమ అంతస్తును యితరులు అందుకోవటం వారు సహించరు. తమ ఆధిపత్యం, ఇతరుల మీద తాము చలాయించే అధికారము తగ్గపోతుందని వారి భయం అని శ్రీ వివేకానంద సాహత్య సర్వస్వం.అందుఏతనే భగవద్గీతలోని ఈ శోకాన్ని ఉటంకించి శ్రీకృష్ణ పరమాత్మడే చెప్పాడు వారికి జ్ఞానం బోధించవద్దని, వారికి ప్రస్తుతమున్న భావాలను చెదరకొట్టకూడదని అని వారంటారు. విఏకానందస్వామి అంటారు. జ్ఞానం తప్పులకుదారి తీస్తుందా? వికాసం అయోమస్థితికి కొనిపోతుందా? అలాంటిది సాధ్యమా? గీతలో శ్రీకృష్ణుడు సాహసంతో బోధించిన ఉత్కష్ట సత్యాలు కూడా తరవాతి తరాల శిష్య పరంపరచే వక్రాన్వయ పద్ధతిలో గ్రహించబడ్డాయి. ఇందువల్లలో ఓత్తరమైన ధర్మ గ్రంథాలనుంచి జనాన్ని పెడదారి పట్టించే తప్పుడు సిద్ధాంతాలను పలికించటం జరుగు తోంది. ఇంకా వివేకానందస్వామి ఇలా అంటారు. లోకాచారాలను దేశౄచారాలను పాటించి తీరాలనే సిద్ధాంతాన్ని ప్రిపాదిస్తారు. మసిపూసి మారేడుకాయ చేయతగదు. శవాలమీద పువ్వుల కుప్పను అమర్చట మెందుకుని ‘తత్రాపిలోకాచారః సనా ప్రజల ఆచారాలను అనుసరించే

తీరాలి. ఇలాంటి వాక్యాలను లక్ష్య పెట్టవద్దు. ఇది అర్థంలేని ప్రసంగం. దీని ఫలితంగా దివ్య సత్యాలు శ్రీఘ్ర కాలంలో పెంటపోగు కింద మరుగున పడిపోయాయి. పెంటపోగులే దివ్యసత్యాలుగా ఉత్సాహంతో భావించబడ సాగాయి. ఎవరైనా మూఢబిశ్వాసాలను కలిగియుండి, మూర్ఖ ఆచారాలను పాటిస్తుంటే విజ్ఞులు, వివేకవంతులు గుడ్లప్పగించి చూస్తూ ఉండరాదు. వాటిని ఖండించవల- రాసిందే. వారికి తగిన విధంగా బోధించి సక్రమమైన మార్గంలో వారిని పెట్టాల్సిందే. అర్జునుని విషయంలో శ్రీకృష్ణుబు చేసినది అదే.
– రాచమడుగు శ్రీనివాసులు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/