స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు

Y. S. Chowdary
Y. S. Chowdary

అమరావతి: సంవత్సరం పైగా పాకిస్థాన్‌ లోని జైల్లో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇరవై మంది మూడు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి ఎంపీ సుజనా చౌదరి స్పందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంఖర్‌ కి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్‌లో జైల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల విడుదలకు వీరు ఎంతో కృషి చేశారని అన్నారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ సుజనా చౌదరి ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/