సుమిత్‌ నగల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌

సుమిత్‌ నగల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌

న్యూఢిల్లీ: తాజాగా ప్రకటించిన ఎటిపి ర్యాంకింగ్స్‌లో భారత్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ సు మిత్‌నగల్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కెరీర్‌ అత్యుత్తమ 129 ర్యాంకు సాధిం చా డు.ఎటిపి ఛాలెంజర్‌ పోటీల్లో గతవారం ఫైనల్‌ చేరిన అతడు అర్జెంటీనాకు చెందిన జువాన్‌ ఫికోవిచ్‌ చేతిలో ఓటమిచెందాడు. ఏకపక్షంగాసాగిన మ్యాచ్‌లో సుమిత్‌ 4-6,1-6 తేడాతో ఓడిపోయాడు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం జరిగిన బ్యూనస్‌ ఎయిర్స్‌ఎటిపి ఛాలెంజర్‌ ఈవెంట్‌లో సుమిత్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు.ఈ విజయంతో ఒకేసారి 26స్థానాలు ఎగబాకి 135వ ర్యాంక్‌ సాధించాడు.ఈనేపథ్యంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ఆరుస్థానాలు మెరుగుపడి 129వ ర్యాంకు చేరుకున్నాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/