శాండర్స్‌కు 4.65 కోట్ల డాలర్లు విరాళాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న సెనేటర్‍ బెర్నీ శాండర్స్

Bernie Sanders
Bernie Sanders

అమెరికా: అమెరికాలో త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‍ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న సెనేటర్‍ బెర్నీ శాండర్స్ కు ఫిబ్రవరిలో 4.65 కోట్ల డాలర్ల విరాళాలు అందినట్లు ఆయన ప్రచార నిర్వహకులు వెల్లడించారు. ప్రైమరీస్‍, కాకసన్‍ ఎన్నికలకు ముందు నిర్వహించే భారీ సదస్సులో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడే అభ్యర్థులు ప్రసంగించిన అనంరతం పార్టీ శ్రేణులు, కార్పొరేట్‍ సంస్థలు విరాళాలు అందజేస్తాయి. విరాళాలు ఎంత ఎక్కువగా వస్తే ఆ అభ్యర్థికి పార్టీలో అంతగా పలుకుబడి ఉన్నట్టుగా అక్కడ భావిస్తారు. శాండర్స్తో పాటు రేసులో వున్న మరో సోషలిస్టు వారెన్‍కు 2.9 కోట్ల డాలర్లు, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‍కు 1.9 కోట్ల డాలర్లు లభించాయి. సౌత్‍కరోలినాలో బిడెన్‍ విజయం సాధించినప్పటికీ సూపర్‍ ట్యూస్‍డే ముందు జరిగిన డెలిగేట్‍ కౌంట్‍లో శాండర్స్ సృష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తరువాతి స్థానంలో బిడెన్‍ నిలిచారు. సౌత్‍ కరోలినా ప్రైమరీ రోజు తమకు 50 లక్షల డాలర్ల మేర విరాళాలు లభించినట్లు బిడెన్‍ ప్రతినిధి చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/