బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ కరోనాతో మృతి

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన విలక్షణ నటుడు

Soumitra Chatterjee -File

Kolkata: కరోనాతో పోరాడుతూ బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూశారు.   

కరోనాతో దాదాపుగా 40 రోజుల నుంచి పోరాడుతున్న బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆదివారం కోల్‌కత్తాలో కన్నుమూశారు.

ఆయన వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించిందని, ఆయనను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఈ నటుడు బెంగాలీ సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్నారు.

దిగ్గజ బెంగాలీ దర్శకుడు సత్యజిత్‌రే క్లాసిక్ మూవీ ‘అపుర్ సంసార్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సౌమిత్ర పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

సత్యజిత్‌రే దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో సౌమిత్ర నటించడం విశేషం.

‘ఘరె బైరె’, ‘అరణ్యర్ దిన్ రాత్రి’, ‘చారులత’ చిత్రాలు సౌమిత్రకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/