కళ్ల మంటలకు వెలగపండుతో చికిత్స

ఆరోగ్య చిట్కాలు

కళ్ల మంటలకు వెలగపండుతో చికిత్స
benefits of velaga fruit

వెలగ పండులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండును వినాయకచవితికి వినాయకుడికి నైవేద్యంగా పెడతారు.

ఈ పండు గుజ్జు, ఆకులు, బెరడు పొడిలో పెక్టిన్‌, టానిన్‌ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని ఔషధాల్లో ఉపయోగిస్తారు.

100 గ్రాముల వెలగపండు గుజ్జులో 140 కేలరీలు, 32 గ్రాముల పిండి పదార్థాలు, రెండు గ్రాముల ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్‌, సిట్రస్‌ ఆమ్లాలతో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి.

వెలగపండును తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవు.

వెలగపండుతో తయారైన కషాయం జలుబు వల్ల కలిగే శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.

ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది. కళ్లలో వివిధ ఇన్ఫెక్షన్లు, మంటలకు చికిత్స చేసేందుకు వెలగపండు ఉపయోగపడుతుంది. మలబద్ధకం, కడుపులో రుగ్మతలు వంటి చికిత్సలకు వెలగపండు ఉపయోగిస్తారు.

ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది. రక్తశుద్ధి జరగటం వల్ల కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది.

ఈ పండు తీసుకోవడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌లు దరిచేరవు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/