కరివేపాకు ..తీసి పారేయొద్దు !

ఆకుకూరలు – ఆరోగ్యం

benefits of curry leaves
benefits of curry leaves

కరివేపాకే కదా అని తీసిపారేయడం మనకు అలవాటు. కూరల్లో అది వస్తే పక్కన పెట్టేస్తాం. కానీ పనిలో దాన్నీ నమిలేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కరివేపాకు మనకు లభించడం మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అది వంటలకు రుచి సువాసన ఇవ్వడమే కాదు.. వాటిని రోజూ వాడితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

  • శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకులు తరిమేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్‌ పెడతాయి.
  • డయేరియా సమస్యకు సరైన పరిష్కారం కరివేపాకులు.వాటిలో కారిబాజోల ఉంటుంది. అది విరేచనాలకు బ్రేక్‌ వేస్తుంది. అందుకే ప్రతీ కూరలో కరివేపాకులు వేస్తారు.కరివేపాకు దగ్గు, జలుబులకు చెక్‌ పెడుతుంది. అందుకే ఈ ఆకులను వానాకాలంలో తప్పక వాడతారు.
  • కరివేపాకులో ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది.
  • కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా ఉంటాయి. అవి బాడీలో ఘగర్‌ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తాయి. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు కరివేపాకులు తింటే మేలు.
  • కిడ్నీ సమస్యలతో బాధపడేవారు. కరివేపాకుల్ని ఉడకబెట్టి.. తాగితే మంచిదే. యూరినరీ సమస్యలకు కూడా కరిఏపాకు బాగా పని చేస్తుంది.
  • సరైన పోషకాలు లేని వారికి జుట్టు తెల్లబడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు కరివేపాకులు సాయపడతాయి. జుట్టు బాగా పెరిగేందుకు కూడా ఇవి సహకరిస్తాయి.
  • శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు కరివేపాకులు బాగా పనిచేస్తాయి.
  • చర్మాన్ని కూడా కాపాడతాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/