‘స్వాతి ముత్యం’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన

బెల్లం కొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం స్వాతి ముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో.. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. ‘దసరా’ పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీనివాస్ మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ‘ఛత్రపతి’ రీమేక్ తో శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతుండగా, ఆయన తమ్ముడు టాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం.