బెల్లకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ ఫస్ట్ లుక్ కేక

తెలుగు లో ప్రభాస్ – రాజమౌళి కలయికలో వచ్చిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో బెల్లకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ హిందీలో డైరెక్ట్ చేస్తున్నాడు. గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి ఉన్నాడు.

18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం..ఈ సినిమా తో బెల్లకొండ శ్రీనివాస్ హిందీ లో అడుగుపెడుతుండడం తో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. వేసవి కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతి లాల్‌ నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా శ్రీనివాస్ కు ఎంత మేర కలిసొస్తుందో చూడాలి.