కీలక నిర్ణయం తీసుకున్న చైనా

ఇక మాస్క్‌లు అక్కర్లేదు.. చైనా ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ

Beijing health authorities allow residents to go mask-free

బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తింగా కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరికి మాస్క్‌ తప్పనిసరి అయింది. అయితే చైనా మాత్రం ఇందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో ఇక మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఈ మేరకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు. వరుసగా 13 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం మాస్క్‌ ధరించి తిరగడం గమనార్హం.

బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏప్రిల్ చివర్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా వెళ్ళవచ్చని చెప్పింది. కానీ నగరంలోని అతిపెద్ద మార్కెట్‌లో కొత్త కేసులు వెలుగు చూడటంతో జూన్‌లో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. కాగా రాజధాని, జిన్జియాంగ్, ఇతర ప్రాంతాలలో కేసులను విజయవంతంగా నియంత్రించిన తరువాత గత ఐదు రోజులుగా ఇక్కడ కొత్తగా కేసులు నమోదు కాలేదు. మాస్క్‌ ధరించడం, హోం క్వారంటైన్‌, టెస్టింగ్‌లో పాల్గొనడం వంటి నియమాలను కఠినంగా అమలు చేయడం వల్లనే ఈ వ్యాధిని నియంత్రించడంలో చైనా విజయవంతం అయ్యిందంటున్నారు నిపుణులు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/