తైవాన్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్‌

Taiwan votes
Taiwan votes

తైవాన్: తైవాన్ దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తైవాన్ దేశ అధ్యక్షుడితో పాటు ఆ దేశ పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. తైవాన్ అధ్యక్షురాలిగా సై యింగ్‌ వెన్‌ రెండోసారి ఎన్నికల బరిలోకి దిగారు. తైవాన్ దేశంలో 19.3 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తైవాన్ దేశంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది. పోలింగ్ అనంతరం నాలుగు గంటలకే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/