హైదరాబాద్ లో ఘోరం : మద్యానికి డబ్బు ఇవ్వలేదని వ్యక్తిని కొట్టి చంపిన బిచ్చగాడు

రోడ్ల ఫై , దేవాలయాల దగ్గర చాల చోట్ల బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీరిలో తిండి కోసం బిక్షం అడిగితే కొంతమంది మాత్రం మద్యం కోసం డబ్బులు అడుగుతుంటారు. ఆలా మద్యానికి బానిసైన ఓ బిచ్చగాడు..ఓ వ్యక్తి ని డబ్బులు అడిగితే ఇవ్వలేదని కొట్టి చంపిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…

లాల్ దర్వాజా అత్తర్ కి దర్గా ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి మద్యానికి బానిసై రోడ్డుపై వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కుంటూ మద్యం సేవిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్ ఈ నెల ఒకటో తారీఖున మొగల్ పురా కి చెందిన ఆటో డ్రైవర్ జహంగీర్ ను అర్ధరాత్రి 12గంటలకు డబ్బులు ఇవ్వాలని అని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని… డబ్బులు ఇవ్వనని జహంగీర్ చెప్పాడు. అంతే కోపానికి గురైన ఇర్ఫాన్ జహంగీర్ పై దాడి చేశాడు. జహంగీర్ పారిపోయినా కూడా వెంటపడి మరీ ఇర్ఫాన్ జహంగీర్ ను కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఇర్ఫాన్ పారిపోయాడు. అనంతరం పోలీసులు ఒకటో తేదీన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఇక విచారణ లో ఇర్ఫాన్ డబ్బులు ఇవ్వలేదని హత్య చేసినట్టు తేలింది.