కరోనా సహాయ నిధికి యాచకుడు రూ. లక్ష విరాళం
కలెక్టర్ ప్రశంస- ‘సామాజిక కార్యకర్త’ బిరుదుతో సత్కారం

Madurai: తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు.
అతడి ఔదార్యాన్ని ప్రశంసించిన కలెక్టర్ సామాజిక కార్యకర్త అన్న బిరుదుతో సత్కరించారు..
మదురైకు చెందిన పూల్‌పాండియన్ అనే వ్యక్తి యాచిస్తూ జీవిస్తున్నాడు…కరోనా మహమ్మారితో పలువురు మరణించడాన్ని చూసి అతడు చలించిపోయాడు
. దీంతో తన వంతు సహాయంగా మే నెలలో రూ. పది వేల విరాళం ఇచ్చాడు..గత మూడు నెలల్లో భిక్షాటన ద్వారా రూ.90 వేలు సేకరించాడు.
మదురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆ డబ్బును కరోనా నిధికి విరాళంగా ఇచ్చాడు.. కాగా, సమాజం పట్ల పూల్‌పాండియన్ బాధ్యతను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్ ఆయనను సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
దీంతో పాండియన్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశాడు..జిల్లా కలెక్టర్ తనకు సామాజిక కార్యకర్త అన్న బిరుదు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/