ముఖం కడుక్కునే ముందు..

FACE WASHING-
FACE WASHING-

కొందరు తరచూ ముఖం కడుక్కోవడం చేస్తుంటారు. మర్ధన వంటి చేస్తుంటారు. ముఖం కడుక్కోవడానికి, మేకప్‌ వేసుకోవడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతులకున్న మురికి, పైన పేరుకున్న బ్యాక్టీరియా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి. పొడి చర్మతత్వం ఉన్న వారు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడం మంచిది. దానిలో ఉండే ఘాటైన రసాయనాలు చర్మం ఇంకా పొడిబారేలా చేస్తాయి. అందుకే తేనె, అరటిపండుతో మర్దన చేసుకుని స్నానం చేయడం మంచిది. తరచూ మాయిశ్చరైజర్లు రాయాలి. నిపుణుల సలహాతో నాణ్యమైన ఫేస్‌వాష్‌ని ఎంచుకోవాలి.
ప్రతిరోజు చర్మం మెరవాలని అందరికి ఉంటుంది. అయితే అదే పనిగా క్లెన్సర్లు, స్క్రబ్‌లు వాడటం వల్ల ఆ మెరుపు సాధ్యం కాదు. చర్మం ఇంకా నిర్జీవంగా మారుతుంది. అందుకే అప్పుడప్పుడూ వాటిని వాడుతూ ఆవిరి పట్టాలి. ముఖం

శుభ్రం చేసుకోవడానిక అతి చల్లని, మరీ వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు. గోరువెచ్చగా ఉన్న నీటిని తీసుకోవాలి. స్నానంతో సంబంధం లేకుండా రోజుకు రెండు మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది. అదే పనిగా శుభ్రం చేసుకుంటే చర్మంపైనున్న నూనె గ్రంథులు తొలగిపోయి పొడిబారుతుంది. కొన్నిసార్లు చర్మం ఇరిటేట్‌ అయి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాద ముంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/